మహాత్ముడి సేవలు చిరస్మరణీయం

పి.గన్నవరం: మహాత్మాగాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు శ్లాఘించారు. గాంధీజీ 69వ వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానికంగా ఉన్న గాంధీజీ విగ్రహానికి కొండేటి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రోధ్యమంలో గాంధీజీ అందించిన సేవలను కొనియాడారు. ప్రపంచంలో ఎంతో మందికి గాంధీజీ ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జక్కంపూడి వాసు, అల్లు బుజ్జి, యూవీవీ సత్యనారాయణ, నెల్లి దుర్గాప్రసాద్, జగతా అరుణ్, చిక్కం బుజ్జిబాబు, వాకపల్లి వీరాస్వామి, కొమ్ముల పాపారావు, యెరుబండి చిట్టికాపు, ఎండీవై షరీఫ్, మొల్లా మహ్మద్‌అలీ, అన్వర్‌ తాహిర్‌ హుస్సేన్, మజహర్‌ అలీ, నయినాల కన్న, అక్బర్‌ అలీ, ఎన్‌.వెంకట్రావు, యనమదల సత్యనారాయణ, పెండ్యాల అచ్చిబాబు, ఎండీ జమా, యల్లమెల్లి శ్రీనివాస్, కొండేటి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top