మ‌హాత్మా జ్యోతిరావ్‌పూలే ఆశ‌యాలు ఆద‌ర్శంగుంటూరు: దేశ దళిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రిజర్వేషన్ల పితామహుడు, దేశ దర్శనికుడు మహాత్మా జ్యోతి రావ్‌పూలే ఆశ‌యాలు ఆద‌ర్శ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణంలో   జ్యోతిరావ్‌పూలే  చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌ మాట్లాడుతూ భారతదేశంలో నిమ్న‌కులాల అభ్యున్నతికి కృషి చేసిన పోరాటయోధుడు జ్యోతిరావుపూలే అని కొనియాడారు. విద్యా ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అందుకై విద్యను చదువుకొవాలని ప్రోత్సహించి, స్వయాన అతడే పాఠశాలలను నిర్మించి, తన భార్య సావిత్రిబాయికి విద్యాబుద్ధులు చెప్పి, మహిళల కోసం తన భార్యను ఉపాధ్యాయురాలుగా నియమించిన స్ఫూర్తిప్రధాత అన్నారు.  సామాజిక చైతన్యం కావాలని పోరుసల్పిన సామాజిక ఉద్యమ పితామహుడు జ్యోతిరావ్‌పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్దామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు.
Back to Top