రైతు సమస్యలపై మహాధర్నా

అనంతపురంః కరువుతో విలవిలలాడుతోన్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.  వేసవికి ముందే గ్రామాల్లో తాగునీరు సమస్యలు తలెత్తుతున్న పరిస్థితులున్నాయని అన్నారు. హంద్రీనీవానుండి నీళ్లొస్తాయని ఆశపడ్డ రైతాంగానికి నిరాశే ఎదురైందన్నారు. పీఏబీఆర్ కుడికాల్వ కింద ఉన్న చెరువులన్నీ పూర్తిగా నింపడంతో పాటు  హెచ్ఎల్సీ కింద ఉన్న ఆయకట్టుకు,  అదేవిధంగా హంద్రీనీవా ఫేజ్ టూలో వేసుకున్న పంటలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. ఇన్ పుట్ సబ్సిడీ కి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిమితి విధించాలని,  ఎకరాకి రూ. 19500 ఇన్ పుట్ సబ్సిడీ సత్వరమే చెల్లించాలన్నారు.  వీటన్నంటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలతో మమేకమై అఖిలపక్షం ఆధ్వర్యంలో  ఈనెల 31న మహాధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా రైతాంగాన్ని కోరారు.
Back to Top