'మహానేత వైయస్‌ వల్ల ఎంతో లబ్ధి పొందాం'

నెల్లూరు, 13 ఏప్రిల్‌ 2013: ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలను ఆయన సోదరుడు ఆనం జయకుమార్‌రెడ్డి తప్పుపట్టారు. వైయస్‌ కుటుంబం పట్ల రామనారాయణరెడ్డి మాట్లాడిన తీరు, ఆయన వాడిన భాష తనను చాలా కలచివేసిందన్నారు. మహానేత వైయస్‌ తమ అన్నలు వివేకానందరెడ్డిని, రామనారాయణరెడ్డిని సొంత తమ్ముళ్ళ మాదిరిగా ఆదరించారన్నారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి వల్ల తమ కుటుంబం ఎంతగానో లబ్ధిపొందిందని ఆయన చెప్పారు. తన అన్న ఆనం వివేకానందరెడ్డి రాజకీయ ఎదుగుదలకు వైయస్‌ఆర్ కారణం అన్నారు. రా‌మనారాయణరెడ్డి వ్యాఖ్యలు తనను చాలా బాధిస్తున్నాయని చెప్పారు. మహానేత వైయస్ వల్ల లబ్ధి పొందిన వా‌రిలో తమ సోదరులే మొదటివారని జయకుమార్‌రెడ్డి అన్నారు.
Back to Top