'మహానేత వైయస్‌ఆర్ పథకాలకు తూట్లు'

శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) : మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ‌, అభివృద్ధి పథకాలు కుంటుపడుతున్నాయని శ్రీకాళహస్తి మండలం సింగిల్‌ విండో అధ్యక్షుడు వీరరాఘవపురం రాజారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మహానేత సంక్షేమ పథకాలు మళ్ళీ నిరుపేదలకు అందాలంటే వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సిఎం కావాల్సిన అవసర ఉందని ఆయన అన్నారు. అందుకే తన అనుచరులలతో కలసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరినట్లు చెప్పారు. రాజారెడ్డి బుధవారంనాడు వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. శ్రీకాళహస్తిలోని వైయస్‌ఆర్‌సిపి కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యం లో 50 మంది అనుచరులతో కలసి పార్టీలో చేరారు.

సింగిల్‌ విండో ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి సునాయాసంగా విజయం సాధిస్తుందని రాజారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.‌ మహానేత వైయస్‌ఆర్ పాలనలో రైతులకు భరోసా ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం రైతు కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Back to Top