మహానేత వైయస్‌ఆర్‌కు విజయమ్మ నివాళి

హైదరాబాద్, 2 ఏప్రిల్‌ 2013: 'కరెంటు సత్యాగ్రహం' ప్రారంభించడానికి ముందుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. లోటస్‌పాండ్‌లోని తమ నివాసం నుంచి ఆమె ‌పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పంజాగుట్ట చేరుకుని, అక్కడ వైయస్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం బషీ‌ర్‌బాగ్‌లో ఉన్న విద్యుత్‌ ఉద్యమ అమర వీరుల స్తూపం వద్దకు వెళ్ళారు.
Back to Top