మహానేత నా రాజకీయ గురువు

హైదరాబాద్ 22 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తన రాజకీయ గురువని రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చెప్పారు. శుక్రవారం ఆయన చంచల్‌గుడా జైలుకు వెళ్ళి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చారు. ఆయనను అక్రమంగా అరెస్టుచేసి నేటికి 300 రోజులయ్యిందనీ, ఆయనకు సంఘీభావం తెలపడానికి వచ్చాననీ శ్రీశైలం విలేకరులకు తెలిపారు. మంచిరోజు చూసుకుని త్వరలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పారు. నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటుచేసి శ్రీమతి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానన్నారు. 2009లో తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని కారణంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి నియోజకవర్గ ప్రజల మద్దతుతో గెలుపొందానని వివరించారు. ప్రజల కోరిక మేరకు రాజశేఖరరెడ్డిగారి హయాంలోని కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యునిగా వ్యవహరించానన్నారు. అక్రమంగా అరెస్టుచేసి ఇబ్బందులు పడుతున్న శ్రీ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండమని చెప్పి ప్రజలు తనను పంపారని పేర్కొన్నారు. వారి కోరిక మేరకు తాను ఇక్కడికి వచ్చానన్నారు. మా నియోజకవర్గంలోని నా అనుచరులంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతామని చెప్పారు. ఆ సమయంలో జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

Back to Top