మహానేత హయాంలోనే రైతు సంక్షేమం

వెదురుకుప్పం:

రైతుల సంక్షేమానికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనేక పథకాలు అమలు చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి చెప్పారు. వెదురుకుప్పంలో సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా పార్టీ మద్దతుదారులతో కలసి ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దివంగత మహానేత ఉచిత విద్యుత్తు, రుణ మాఫీ, రైతులకు రుణాలు వంటి పథకాలు అమలుచేశారని చెప్పారు. ప్రస్తుతం అధికార వ్యామోహంతో కొన్ని రాజకీయ పార్టీలు రైతులను మోసిగించేందుకు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆరోపించారు. డాక్టర్ వైయస్‌ఆర్ రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న పాలకులు, ఆయన కుటుంబంపై చేస్తున్న వేధింపులు, కుట్రలు ఇన్నీ అన్నీ కావన్నారు. నాయకులు సైతం పార్టీలోకి ఇదిగో వస్తాం...అదిగో వస్తాం అంటూ స్వార్థం కోసం బూటకపు ప్రచారాలు సాగిస్తున్నారనీ, వైయస్ఆర్ కుటంబాన్ని నిజంగా అభిమానించే నాయకులు పార్టీలోకి వచ్చి అండగా నిలవాలనీ పిలుపునిచ్చారు. పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి రైతులకు అండగా నిలవాలన్నారు.

Back to Top