మహానేత ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నిర్మల్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు చేరాలంటే పార్టీని బలోపేతం చేయాలని మాజీ ఎంపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నిర్మల్ పట్టణం, మండలంలోని నీలాయిపేట్‌కు చెందిన టీఆర్‌ఎస్, టీడీపీ యువకులు పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో జిల్లా, రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు  చోటుచేసుకున్నాయన్నారు. పార్టీలో చేరిన వారిలో కృష్ణ, అన్సూర్, ఇమ్రాన్‌ఖాన్, సల్మాన్, వెంకటేశ్, రాజ్‌కుమార్, నవీన్ తదితరులు ఉన్నారు.

Back to Top