మినీ కాదు మనీ మహానాడు-అంబటి రాంబాబు

హైదరాబాద్ః చంద్రబాబు మినీ మహానాడును మనీ మహానాడుగా మార్చారని వైయస్సార్సీపీ
అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో
ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో ఏం సాధించారని మహానాడును నిర్వహిస్తున్నారని
అంబటి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై అవాకులు, చెవాకులు పేల్చుతున్నారు తప్పితే...మహానాడులో
రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలను కనీస ప్రస్తావనకు తీసుకురాకపోవడం
విడ్డూరంగా ఉందన్నారు. క్రమ శిక్షణ గురించి మాట్లాడే చంద్రబాబు...ముందు ఆయనకున్న
క్రమశిక్షణ ఏపాటిదో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను
కొనడమేనా మీకున్న క్రమశిక్షణ అని నిలదీశారు.Back to Top