తెనాలి : ‘పంటలకు కిష్ణా కాలవ నీళ్లు ఇయ్యలేదమ్మా. ఇంజిన్ అద్దెకు పెట్టి మొక్కజొన్నకు నీళ్లు కడుతున్నాం. ఇంజిన్‌కి గంటకు రూ.200 అద్దె. ఎకరా తడపాలంటే 20 గంటలు పడుతుంది. నాలుగెకరాలు కౌలుకు సాగుచేస్తున్నా. ఎకరాకు రూ. 15 వేల చొప్పున రూ.60 వేల దాకా ఖర్చవుతోంది. కిష్ణా నీళ్లు వదిలితే ఇంజిన్ బాధలేక నాలుగు రూపాయలు మిగిలేయి. నీళ్లు కడితేనే కండె లావెక్కేది. కండెలు పెరగక కొనేవాళ్లు ముందుకు రావడం లేదు’ అని వేమూరు నియోజకవర్గం కూచిపూడి వద్ద తుమ్మా నాగిరెడ్డి అనే రైతు శ్రీమతి షర్మిల వద్ద వాపోయాడు.
కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చేందుకు మహానేత రాజన్న తనయ శ్రీమతి షర్మిల చారిత్రక, సుదీర్ఘ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి అయిన శ్రీమతి షర్మిల ఈ సాహసోపేతమైన పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారంనాడు గుంటూరు జిల్లా వేమూరు, తెనాలి నియోజకవర్గాలలో కొనసాగింది. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గం కూచిపూడి వద్ద రైతు నాగిరెడ్డి శ్రీమతి షర్మిలతో తమ పంట కష్టాలు చెప్పుకున్నాడు. అద్దెకు తెచ్చిన ఇంజిన్ ద్వారా నీరు పారిస్తున్న తన మొక్కజొన్న పంటను శ్రీమతి షర్మిలకు చూపించి కష్టాలు చెప్పుకున్నారు. ‘ఓ పక్క వరి కూడా వేస్తున్నానమ్మా.. ఇప్పుడు వరికి కూడా నీళ్లు లేవు. ఖర్చులు పెరిగినా లోగడ ఉన్న ధరలే ఉన్నాయమ్మా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
బుధవారానికి పాదయాత్ర 96 రోజులు, 1,321.5 కిలోమీటర్లు :‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం 96వ రోజు ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల మొత్తం 1,321.5 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేశారు. బుధవారం ఆమె వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో 13.6 కిలోమీటర్లు నడిచారు.