బాబుకు మతి భ్రమించింది

ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రజల డబ్బులతో రోడ్లేసి సొంత డబ్బు ఇచ్చినట్లు సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన శనివారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ఓటుకు రూ.5వేలు ఇస్తాననడంతోనే ఎన్ని లక్షల కోట్ల ప్రజాధానం దోచుకున్నారో అర్థం అవుతుందని కారుమూరి అన్నారు. సీఎం హోదాలో ఉండి ప్రజలను పార్టీపరంగా విభజించడం దుర్మార్గమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు.
 
Back to Top