మాదిగలంతా వైయస్‌ జగన్‌ వెంటే


తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీపై మాదిక ఐక్య వేదిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మాదిగలంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటారని వారు పేర్కొన్నారు. బుధవారం వైయస్‌ జగన్‌ను మాదిగ ఐక్య వేదిక నేతలు కలిశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడం పట్ల మాదిగ ఐక్య వేదిక నాయకులు కిషోర్, రాజేష్‌ హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top