మాజీ మంత్రి బొత్స జన్మదిన వేడుకలు

విజయనగరం: వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ  నాయకుడు, మాజీ
మంత్రి బొత్స సత్యనారాయణ  జన్మదిన వేడుకలు విజయనగరంలో  ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీలో చేరిన తరువాత జరుపుకున్న
ఈ వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు,  అభిమానులు వచ్చి బొత్సకు జన్మదిన
శుభాకాంక్షలు  తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన
పలువురు ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ కార్యక్రమానికి
హాజరయ్యారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో
నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పుష్పగుచ్ఛాలు, కండువాలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు  తెలిపారు. పలువురు అభిమానులు గజమాలలతో సత్కరించారు.

Back to Top