జల్సారాయుడికి పరామర్శించే టైం లేదా

  • బాబుకు మనవడి పుట్టెంటుకలు తీసేందుకు కూడా ప్రజల సొమ్మే
  • వైయస్‌ జగన్‌పై కేసు బాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
  • ఎలుకలు కరిసి శిశువు చనిపోతే అప్పుడేమైంది అభివృద్ధి కమిటీ
  • 11 మంది ప్రాణాలు తీసిన దివాకర్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలి
  • ఎంపీ జేసీని బర్తరఫ్‌ చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌
  • రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
తిరుపతి: 6 కిలో మీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రతి దానికి హెలికాఫ్టర్‌లో తిరుగుతూ జల్సాలు చేసే జల్సారాయుడు చంద్రబాబుకు 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించే సమయం లేదా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. విందులు, వినోదాలు, విహార యాత్రలకు టైం కేటాయించే సీఎంకు సమయం లేదా.. లేక వెళ్లేందుకు హెలికాఫ్టర్‌ లేదా అని ఎద్దేవా చేశారు. నీ మనవడి పుట్టెంటుకలు తీసేందుకు ప్రజా సొమ్ముతో హెలికాఫ్టర్‌లో తిరిగే నీకు ప్రజలకు ప్రమాదం జరిగితే వెళ్లి వారిని హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత లేదా అని చంద్రబాబును నిలదీశారు. తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై టీడీపీ సర్కార్‌ అక్రమంగా బనాయించిన కేసును ఆమె తీవ్రంగా ఖండించారు.  అభివృద్ధి కమిటీల నుంచి ఎమ్మెల్యేలను తీసేసి ఎవరో అనామకులను అభివృద్ధి కమిటీ చైర్మన్‌లుగా వేసుకొని ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు.

 బాధ్యతల గల పౌరుడు వైయస్‌ జగన్‌
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు తనమీద నమ్మకం పెట్టుకున్న నిలబెట్టుకునే బాధ్యత గల పౌరుడిగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రోజా ఫైరయ్యారు. గుంటూరు ఆసుపత్రిలో పసిపాపను ఎలుకలు కొరికి చంచేస్తే ఆ సిబ్బందిని ఎందుకు మళ్లీ కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఆ రోజు అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఏమైపోయాడని ప్రశ్నించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందా లేక కుట్రలు పన్ని పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేసే విధంగా పనిచేస్తుందా..? ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడి పారిపోయే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ కాదని స్పష్టం చేశారు. 11 మంది ప్రాణాలను బలిగొన్న జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోస్టుమార్టం రిపోర్డు తారుమారు చేసి జేసీని కాపాడాలని చూస్తున్నారని బాబుపై మండిపడ్డారు.  వైయస్‌ జగన్‌ చెప్పినట్లుగా తప్పుచేసిన అధికారులను, తప్పించుకొని తిరుగుతున్న ట్రావెల్స్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేసే విధంగా న్యాయం పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

ట్రావెల్స్‌ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్న చంద్రబాబు
ప్రమాదానికి కారణమైన జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా వారిని తప్పించడానికి కుట్రలు చేస్తోందని రోజా విమర్శించారు. వారి డబ్బుతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టే దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలతో రవాణా చట్టాన్ని తుంగలో తొక్కి ట్రావెల్స్‌ నడిపిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అడ్డదిడ్డంగా నోరు పారేసుకునే అచ్చెన్నాయుడు తన జిల్లా వాసులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఎందుకు పరామర్శించకుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. రవాణా చట్టానికి వ్యతిరేకంగా  కేశినేని, జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌  నడుపుతూ ఎంత మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంటారని నిలదీశారు. వెంటనే ఆ ట్రావెల్స్‌లను నిలిపివేసి, ఆ ఎంపీలను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఆ నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందా.. లేక ఎంపీలతో ఇప్పిస్తుందా అనేది ప్రభుత్వం డిసైడ్‌ చేసుకోవాలన్నారు. 

మీడియా వాస్తవాలను ప్రజలకు చూపించాలి
చంద్రబాబు చేసే తప్పులను, ప్రజావ్యతిరేక విధానాలను మరుగునపడే విధంగా దయచేసి మీడియా సోదరులు డైవర్ట్‌ చేయోద్దని ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి చేశారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు పుష్కరాల్లో 30 మంది భక్తులను బలితీసుకొని ఇప్పటి వరకు ఆ కుటుంబాలకు న్యాయం చేయలేదన్నారు. అదే విధంగా ఓటుకు కోట్ల కేసులో ఆధారాలతో ఇరుక్కుపోయి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చులు పెడుతూ ఏపీకి ప్రత్యేక హోదాను రానివ్వకుండా కేంద్రం వద్ద తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటిని మీడియా ప్రసారం చేసి వాస్తవ పరిస్థిలు ప్రజలకు చూపించాలన్నారు. ఐఏఎస్‌ అధికారి వైయస్‌ జగన్‌ నన్ను కించపరిచాడని చంద్రబాబు చెప్పుకుంటున్నాడంటే ఇదంతా ప్రతిపక్ష నేతపై బురదజల్లె ప్రయత్నం అన్నారు. ఇదే ఐఏఎస్‌ అధికారి తన కింద పనిచేసే ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని జుట్టుపట్టుకొని ఇసుకలో వేసి కొడితే అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతిలో రైతుల పొలాలు తగులబెట్టి ఏ విధంగా రైతును సర్వనాశనం చేశారో.. ఓటుకు కోట్ల కేసులో రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టుపట్టించాడో..పుష్కారల్లో భక్తులను ఏ విధంగా చంపారో వీటన్నింటిని మీడియాలో ప్రసారం చేసి ప్రజలకు చూపించాలని మీడియాను కోరారు. 
Back to Top