మంచి యోగా గురువును కోల్పోయాం

రాయచోటి: యోగా గురువు, హిందీ పండిట్‌ మురికినాటి తిప్పారెడ్డి మృతికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ నెల 24న తిప్పారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం చెన్నముక్కపల్లెలోని ఆయన స్వగృహానికి ఎమ్మెల్యే చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిప్పారెడ్డి భార్య దేవీ , ఆమె సోదరుడు ఎంపీటీసీ ప్రభాకర్‌రెడ్డిల  మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల చదువులపై ఆరా తీసి, తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. పిల్లలు బాగా చదువుకుని తల్లికి తోడ్పాటు నివ్వాలని చెప్పారు. మంచి యోగా గురువు, అందరితో మంచిగా ప్రవర్తించి, కలుపుకుపోయే మనస్థత్వం ఉన్న వ్యక్తిని కోల్పోయామన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ శ్రీనివాసులురెడ్డి, బీసీ నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top