ఓటమి భయంతో రాద్దాంతం

మండపేట (తూర్పుగోదావరి) : నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుని అనవసర రాద్దాంతం చేస్తున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదన్నారు. పార్టీ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, పార్టీ నేతలతో కలిసి లీలాకృష్ణ  శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నైతిక విలువలకు పట్టం కడుతూ  శిల్పామోహనరెడ్డి చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకోవడం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని లీలాకృష్ణ విమర్శించారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య విలువలను ఖూనీచేసి అడ్డగోలుగా కొనుగోలుచేసి పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబుకు, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోని స్థితిలోనే పార్టీ నేతలతో  దుష్ప్రచారం చేస్తున్నారని  మండిపడ్డారు.  చిత్తశుద్ది ఉంటే జగన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.  . ఎంపీటీసీ సభ్యులు అన్నందేవుల చంద్రరావు, తుపాకుల ప్రసన్నకుమార్, కొప్పిశెట్టి శ్రీనివాస్, పార్టీ నాయకులు గంగుమళ్ల రాంబాబు, వల్లూరి రామకృష్ణ, సరాకుల అబ్బులు, మేడపాటి బసివిరెడ్డి, సవిలే జయంత్, అల్లాడి రాజేష్, కూసు అమ్మన్న, నేల సూర్యకుమార్, సూరంపూడి దుర్గాప్రసాద్, చిక్కాల శ్రీరాములు, రాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

==============
జగన్‌ మాటలకు వక్రీకరణ తగదు

-మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరీదేవి
అంబాజీపేట (తూర్పుగోదావరి) :  నంద్యాల బహిరంగ సభలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నాయకులు వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే యత్నాలు  తగదని మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి అన్నారు. మూడేళ్లుగా చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలు, అరాచకాలపై నంద్యాల సభలో జగన్‌ వాస్తవాలు మాట్లాడారన్నారు. నైతిక విలువలు, నీతివంతమైన రాజకీయాలకు వైయస్సార్‌ సీపీ నిదర్శనమన్నారు. అందుకే శిల్పా చక్రపాణితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి పార్టీలోకి ఆహ్వానించారన్నారు. వైయస్సార్‌ సీపీలో గెలిచిన 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను తీసుకుని వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే జగన్‌ చేసిన విధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు.

----------------------------------------------------
ఏడుకొండలు కుటుంబానికి కొండేటి పరామర్శ

పి.గన్నవరం (తూర్పుగోదావరి) : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మొండెపులంక శివారు జొన్నల్లంకకు చెందిన సందాడి ఏడుకొండలు కుటుంబాన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు శనివారం పరామర్శించారు. ఆయన వెంట పార్టీ నాయకులు నక్కా వెంకటేశ్వరరావు, దాసరి కాశీ, తోలేటి బంగారునాయుడు, యన్నాబత్తుల ఆనంద్, పాటి చిట్టిబాబు, అడ్డగళ్ల శ్రీను, కొల్లాటి వెంకట్రావు, తిరుమాని ఆదినారాయణ, పెమ్మాడి సత్యనారాయణ, యల్లమెల్లి నాగేశ్వరరావు, కొండేటి వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
Back to Top