లారీల సమ్మెతో నిలిచిపోయిన రవాణా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లారీ యూనియన్లు సమ్మెలో ఉన్నాయని, దీంతో ఆహారధాన్యాల రవాణా నిలిచిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభలో ఆయన లారీ యూనియన్ల సమ్మెపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోనే 3 లక్షల లారీలు సమ్మెలో పాల్గొంటున్నాయని తెలిపారు. సమ్మె కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నారని చెప్పారు. పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర కూడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top