లోకేశ్ రాజకీయ అజ్ఞాని : గట్టు

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి, సత్తా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు లేదని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోకేశ్ రాజకీయ అజ్ఞాని అ‌ని దుయ్యబట్టారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్న చరిత్ర మీ నాన్న చంద్రబాబు నాయుడిదంటూ గట్టు రామచంద్రరావు ఘాటుగా విమర్శించారు. మీ‌ నాన్న అవినీతి డబ్బుతో నిన్ను చదివించింది నిజం కాదా ? అని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన ‌టీడీపీలో నీవు, మీ నాన్న ఉన్నారు కానీ... మీకు సొంతంగా పార్టీని పెట్టే సత్తా ఉందా? అని గట్టు ప్రశ్నించారు.

Back to Top