వడ్డీనే మాఫీ కాలేదు

జన్మభుమి గ్రామ సభల్లో నిలదీతల పర్వం
మదనపల్లె: ఎన్నికల ముందు చంద్రబాబు పంట రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు వడ్డీనే మాఫీ కాలేదని రైతులు, మహిళలు టీడీపీ నేతలను, అధికారులను నిలదీస్తున్నారు. బుధవారం మదనపల్లి 9వ వార్డులోని సుబాష్‌రోడ్డులో కౌన్సిలర్‌ బాబునాయుడు అధ్యక్షతన జరిగిన జన్మభూమి సభకు ఎమ్మెల్సీ నరేష్‌ కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డ్వాక్రా రుణాల మాఫీపై ప్రశ్నించగా అసలు కథ దేవుడెరుగు..వడ్డీ కూడా మాఫీ కాలేదని మహిళలు గళం విప్పడంతో ఎమ్మెల్సీ అవాక్కయ్యారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ రుణమాఫీ ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు.  ఇప్పటి వరకూ తమకెవరికీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తీసుకున్న రుణం మొత్తం వడ్డీతో సహా చెల్లించేశామని చెప్పారు. 
Back to Top