జీవితం విలువైన‌ది-ట్విట‌ర్ లో జగ‌న్ సందేశం

హైద‌రాబాద్‌: ప్ర‌త్యేక హోదా కోసం యువ‌కులు ఆత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌టంపై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చ‌లించిపోయారు. బ‌లిదానాలు వ‌ద్దు అంటూ ఆయ‌న పిలుపు ఇచ్చారు. జీవితం విలువైన‌ది అని ఆయ‌న అన్నారు. క‌లిసి జీవిద్దామ‌ని, ఉమ్మ‌డిగా పోరాడ‌దామ‌ని పిలుపు ఇచ్చారు. ఉమ్మ‌డిగా మ‌న హ‌క్కుల్ని సాధించుకొందామ‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. 

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్‌సీపీ తీవ్రంగా పోరాడుతున్నా, అధికార ప‌క్షం తెలుగుదేశంలో పెద్ద‌గా చ‌ల‌నం క‌న్పించ‌టం లేదు. ఈ పరిస్థితి చూసి తిరుపతిలో మునికోటి అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌ర్వాత నెల్లూరు జిల్లా వేదాయ‌పాళెం గ్రామానికి చెందిన ల‌క్ష్మ‌య్య ప్ర‌త్యేక హోదా కోరుతూ ఉరి వేసుకొని చ‌నిపోయాడు. ఈ మేర‌కు సూసైడ్ నోట్ రాశాడు. అటు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి గ్రామానికి చెందిన రాజ‌శేఖ‌ర్ ప్ర‌త్యేక హోదా రావ‌టం లేద‌న్న బెంగ‌తో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఇదే జిల్లాకు చెందిన కైక‌రం గ్రామంలో ప్ర‌సాద్ అనే వ్య‌క్తి ఆత్మాహుతికి య‌త్నించాడు. ఆయ‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
ఈ బ‌లిదానాల మీద వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. శుక్ర‌వారం నెల్లూరు జిల్లా వెళ్లి ల‌క్ష్మ‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాల‌ని నిర్ణ‌యించారు. 
Back to Top