వైయస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి రెడ్యెంకు లేదు

వీరపునాయునిపల్లె: మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పంచన ఉన్న రెడ్యెం వెంకటసుబ్బారెడ్డికి  ప్రజా నాయకుడు జగన్‌మోహనరెడ్డిని విమర్శించే స్థాయి లేదని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకరరెడ్డి విమర్శించారు. శుక్రవారం వైయస్‌ఆర్‌ జిల్లా వీరపునాయునిపల్లెలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. అవినీతి పరిపాలన చేస్తున్న చంద్రబాబును సమర్థించడం రెడ్యెంకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ వి«ధ్వంసం సృష్టించి చంద్రబాబు చేస్తున్న అభివృధ్దిని అడ్డుకుంటున్నాడని చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృధ్ది ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవినీతి చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని టీడీపీ నాయకులు చెబుతున్నారని, అదే మేమే కూడా చెబుతున్నామని చంద్రబాబుకు దైర్యం ఉంటే ఆయన పై ఉన్న కేసులపై స్టే తెచ్చుకోకుండా విచారణకు సిద్దం కావాలని అన్నారు. చంద్రబాబు 18 కేసులపై స్టే తెచ్చుకోక పోయి ఉంటే ఇప్పటికి జైలులో ఉండేవాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు మోడీకి దాసోహమంటున్నాడని, రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడని ఆరోపించారు. చంద్రబాబు పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. 2019లో వైయస్‌ జగన్‌ సీఎం అవుతాడని తెలుసుకున్న చంద్రబాబు  టీడీపీ నాయకులతో ఆరోపణలు చేయిస్తున్నాడని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ది చెబుతాకని హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top