<br/>హైదరాబాద్) ప్రత్యేక హోదా మీద అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. గతంలో ఈ హోదాను కోరుతూ ప్రధానమంత్రి కి రాసిన లేఖకు సంబందించి తిరుగు లేఖ పంపించారు. ప్రత్యేక హోదా పొందేందుకు అవసరమైన అర్హతలు ఆంధ్రప్రదేశ్ కు లేవని ఈ లేఖలో తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం తరపున కేంద్ర వాణిజ్య శాఖ ఉప కార్యదర్శి ఆసిన్ దత్త ఈ లేఖ రాశారు.ప్రణాళికా సంఘం ఈ హోదాకు సంబంధించిన అర్హతల్ని రూపొందించిందని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ అర్హతలు ఆంధ్రప్రదేశ్ కు అప్లయ్ కావటం లదని స్పష్టం చేశారు. అందుచేత ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే రాష్ట్రానికి న్యాయం చేస్తున్నట్లు వివరించారు. ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్ని ఇప్పటికే ఇచ్చినట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. కొ్త్తగా ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. <br/>