ప్రధానికి వైయస్ జగన్ లేఖ





 

() కేంద్ర పథకానికి వక్రభాష్యం చెబుతున్న చంద్రబాబు

() దుష్ప్రచారంతో ప్రజల్లో గందరగోళం

() ప్రధానమంత్రికి లేఖ రాసిన జన నేత వైయస్ జగన్

 

 

కేంద్రం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం 2016( ఇన్‌కం డిక్లరేషన్‌ స్కీమ్‌–2016)కు సంబంధించి చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న
అసత్య ప్రచారాలపై ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సూటిగా
స్పందించారు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి
లేఖ రాశారు.   వివరాలు ఆయన మాటల్లోనే...

 

గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారికి, 

 

సర్, 

ఇటీవల మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐడీఎస్‌– 2106 పథకంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కొందరు
వ్యక్తులు ప్రజల్ని తప్పు దారి పట్టించేవిధంగా చేస్తున్న ప్రకటనల్ని మీ దృష్టికి
తీసుకురాదలిచాం. అక్టోబర్‌ 3న సీబీడీటీ,
కేంద్ర ఆర్థిక
మంత్రి అరుణ్‌జైట్లీ ట్వీట్‌ చేసిన దానికి విరుద్ధంగా రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది.

ట్విట్టర్లో సీబీడీటీ,
ఆర్థిక మంత్రి
అరుణ్‌ జైట్లీ ఏమన్నారంటే..

‘‘  ఏ నగరానికి కానీ, రాష్ట్రానికి గానీ, వ్యాపార సంస్థకు గానీ సంబంధించి ప్రత్యేకంగా
ఆదాయ వివరాలు వెల్లడించలేదు– ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ .”

‘‘
ఏ ప్రాంతానికైనా
సంబంధించిన ఆదాయ వివరాలను ప్రత్యేకంగా మేము వెల్లడించలేదు. ఎవరైనా అలాంటి ప్రచారం
చేస్తుంటే అవి మోసపూరితమైనవే – సెంట్రల్‌ బోర్డు ఫర్‌ డైరెక్టు ట్యాక్సెస్‌(సీబీడీటీ) ”

 

 
       అత్యున్నత స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ఆర్థిక మంత్రి ఇలాంటి స్పష్టత ఇచ్చిన తర్వాత
కూడా రాష్ట్రంలో అసత్య ప్రచారాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఎన్‌డీఏ ప్రభుత్వంలో
భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నది. మరీ
ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రెండు సందర్భాల్లో ఏపీ మరియు  తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రూ. 13 వేల కోట్లు ఆదాయం  వెల్లడి అయిందని తెలిపారు. అందులోనూ ఒక వ్యక్తే
ప్రత్యేకించి పది వేల కోట్లు ఆదాయం వెల్లడించినట్లు ప్రచారం చేశారు. కేంద్రం
ఎవరికీ బహిర్గతం చేయడం లేదని చెప్పినప్పటికీ,  ఇలాంటి వివరాలు చంద్రబాబు అంకెలతో సహా ఎలా
వెల్లడించగలిగారు..? అంటే ఆ పది వేల కోట్లు ఆదాయం వెల్లడించిన
వ్యక్తి ఆయనకు బినామీయేనని   అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే
చంద్రబాబుకి ఈ విషయాలన్నీ గణాంకాలతో సహా ఎలా తెలిసిపోతున్నట్లు..! దీనిపై ఆంధ్రప్రదేశ్
ప్రజలంతా ఈ వివరాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.  ఈ అనుమానాలను మీరు (కేంద్రం) నివృత్తి చేయాల్సిన
అవసరం ఉంది.

        ఈ
సందర్భంగా మీకు మరో విషయాన్ని గుర్తుచేయదలుచుకున్నాను. ఇటీవల ప్రముఖ సంస్థ ఎన్‌సీఏఈఆర్‌(నేషనల్‌
కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ రీసెర్చు) వెల్లడించిన వివరాల ప్రకారం
ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో మొదటిస్థానంలో ఉందని చెప్పిన విషయం విధితమే. దీనికి
సంబంధించి మునుపెన్నడూ లేని విధంగా రెండున్నరేళ్ల కాలంలో చంద్రబాబు సంపాదించిన
లక్షన్నర కోట్ల రూపాయిల తాలూకు అవినీతి వివరాలతో రూపొందించిన ఎంపరర్‌ ఆఫ్‌ కరఫ్షన్‌
అనే పుస్తకాన్ని మీకు అందచేసి ఉన్నాము. సమగ్ర విచారణ జరిపించేందుకు అవసరమైన
ఆధారాలు అన్నింటినీ ఇందులో పొందుపరచడమైనది. ఇంత సమగ్రంగా ఆధారాలు అందించినప్పటికీ
ఏ విధమైన చర్య తీసుకోలేదన్న సంగతి తెలియచేస్తున్నాము. అందుచేత వీటి ఆధారంగా ఈ
అవినీతి బాగోతం మీద సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాము.

అందుచేతనే భారత దేశంలో ఎవ్వరూ ఆయన మీద విచారణకు ఆదేశించలేరన్న విశ్వాసంతో
చంద్రబాబు వ్యవహరిస్తున్నారనటంలో ఆశ్చర్యం లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అవినీతి
మార్గంలో సంపాదించిన అన్ అకౌంటెడ్ నల్ల ధనం వందల కోట్ల రూపాయిలతో ఎమ్మెల్యేలను
కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఆడియో,
వీడియో టేపులతో సహా రెడ్ హేండెడ్ గా దొరికిపోయినప్పటికీ అరెస్టు కాకుండా, రాజీనామా
చేయకుండా కొనసాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబే అయి ఉంటారు.

 

        అందుచేత
ఐడీఎస్‌–
2106 పథకంలో భాగంగా
ఆదాయాలను వెల్లడించిన అందరి వివరాలను బహిర్గతం చేయాలని కోరుతున్నాను. చంద్రబాబు
నాయుడు మీద తలెత్తిన అవినీతి ఆరోపణల మీద సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా
కోరుతున్నాను.

అంతేకాకుండా ఈ లేఖతోపాటు చంద్రబాబు అవినీతి బాగోతం మీద ఆరోపణలు, వాటికి
సంబంధించిన ఆధారాలతో సహా రూపొందించిన పుస్తకం కాపీని జత పరుచుచున్నాము.

 

ఇట్లు 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 

తాజా వీడియోలు

Back to Top