మ‌హానేత‌ను స్ఫూర్తిగా తీసుకుందాం

*జ‌గ‌న‌న్న‌తోనే రాజ‌న్న రాజ్యం సాధ్యం
* నంద్యాల ఓటమి తాత్కాలికమే
* నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
* కర్నూలు ఎంపీ బుట్టా, గౌరు వెంకటరెడ్డి
* జిల్లావ్యాప్తంగా వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  స్వర్ణయుగం మళ్లీ రావాలంటే వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కావడంతోనే సాధ్యమవుతుందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల ఓటమితో నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహ పడోద్దన్నారు. అది తెలుగుదేశం పార్టీకి తాత్కాలిక విజయమేనని, ఇప్పటికీ జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే పటిష్టంగా ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమరోత్సహంతో సైనికుల్లాగా పనిచేస్తే 2019 ఎన్నికల్లో  వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. నంద్యాలలో గెలిచాం కాబట్టి కర్నూలు కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తే గెలుస్తామనే భావంతోనే తెలుగుదేశం పార్టీ ఉందని, ఇక్కడ ఎవరూ ఏమి చెప్పినా కర్నూలు ప్రజలు వినరన్నారు. కర్నూలు, పాణ్యం నియోజకవర్గాలు వైఎస్‌ఆర్‌సీపీ కంచుకోటలని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కార్పొరేషన్‌ను హస్తగతం చేసుకుంటామన్నారు. శనివారం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బుట్టా రేణుక, గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ మురళీకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాంపుల్లయ్య యాదవ్, నాయకులు సురేందర్‌రెడ్డి, సీహెచ్‌ మద్దయ్య, నరసింహులు యాదవ్, రాజావిష్ణువర్దన్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, మహిళా అధ్యక్షురాలు విజయకుమారి, నాయకులుత‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top