వైయస్ జగన్ దీక్ష‌ను జ‌య‌ప్ర‌దం చేద్దాం

హైద‌రాబాద్‌: ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గుంటూరు వేదిక‌గా చేప‌ట్ట‌బోయే రైతు దీక్ష‌ను విజ‌య‌వంతం చేయాల‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక రైతులు అల్లాడుతుంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. రైతుల పట్ల ప్ర‌భుత్వ మొండివైఖ‌రికి, రుణ‌మాఫీ మోసానికి నిర‌స‌న‌గా మే 1, 2 తేదీల్లో గుంటూరు న‌ల్ల‌పాడు రోడ్డు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ రైతు దీక్ష‌ను చేప‌ట్ట‌బోతున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచ కార్మిక దినోత్స‌వం అయిన మే 1వ తేదిన చేప‌డుతున్న ఈ దీక్ష‌కు ఏపీలోని కార్మిక‌, క‌ర్ష‌క వ‌ర్గాలు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కోరారు. రాష్ట్రంలో రైతు సంఘాలు, రైతు సోద‌రులంతా దీక్ష‌కు త‌ర‌లివ‌చ్చి జ‌య‌ప్ర‌దం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Back to Top