ప్లీనరీ విజయవంతం చేద్దాం

సత్తెనపల్లి: నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం కొండమోడు సమీపంలోని వల్లెలా గార్డెన్స్‌లో ఈ నెల 10న నిర్వహించబోయే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైయస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం లో మంగళవారం ఆయన ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి, దుర్మార్గపు పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. వ్యవస్థలను నియంత్రించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. టీడీపీ విధానాలు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి వైయస్సార్‌ సీపీనే ప్రత్యామ్నాయమన్నారు. అందువల్ల ప్రజాసేవలో ముందంజలో ఉంటూ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన అజెండాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి అంతా సిద్ధంగా ఉండాలన్నారు. ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఆయనతో పాటు పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌ నాగూర్‌మీరాన్, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షడు సయ్యద్‌ మమబూబ్, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాస్, వైస్సార్‌ సీపీ పట్టణ అధికార ప్రతినిధి ఎస్‌.ఎం.యూనస్, పార్టీ నాయకులు కట్టా సాంబయ్య, దామచర్ల శరత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Back to Top