టీడీపీకి గుణ‌పాఠం చెప్పాలి

లావేరు: ఎన్నికలు హామీలు అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీ నాయ‌కుల‌కు వ‌చ్చే ఎన్నికల్లో ప్రజలు గుణ‌పాఠం చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ సాంసృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలక్రిష్ణ, మండల అధ్యక్షుడు దన్నాన రాజినాయుడు అన్నారు. మండలంలోని తాళ్లవలస, లింగాలవలస, తామాడ, బుడతవలస, బుడుమూరు, శిగురుకొత్తపల్లి, వెంకటాపురం, అప్పాపురం, కొత్తకోట, అదపాక, పాతకుంకాం, కొత్తకుంకాం, వేణుగోపాలపురం, గుమడాం, బెజ్జిపురం, బొంతుపేట, ఇజ్జాడపాలేం, గురుగుబిల్లి గ్రామాలుతో పాటు మరికొన్ని గ్రామాల్లో శుక్రవారం వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు, భూత్‌ కన్వీనర్‌లు, సభ్యులు ఇంటి ఇంటికి వెళ్లి చంద్రబాబునాయుడు చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. వైయ‌స్‌ జగన్‌ ప్రజలుకు ప్రకటించిన నవరత్నాలు పథ‌కాలు గురించి ప్రజలుకు తెలియజేశారు. కార్యక్రమంలో రణస్ధలం ఎప్‌ఎస్‌సీఎస్‌ అధ్యక్షుడు బొంతు సూర్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దేశేట్టి తిరుపతిరావు, జిల్లా నాయకులు గొర్లె అప్పలనాయుడు, పాలిశెట్టి మధుబాబు, బొంతు ఎల్లంనాయుడు, గంట్యాడ సత్యం, రౌతు సురేంద్రనాయుడు, సర్పంచ్‌లు వాళ్లే దాలినాయుడు, మీసాల రామినాయుడు, పెదనాయిని చిట్టిబాబు, బాడిత రాంబాబు, ఎంపీటీసీ గుమ్మడి దుర్గారావు, యువజన విబాగం మండల అధ్యక్షుడు శాంతాటి మురళీక్రిష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఏనత్తల దుర్గాప్రసాద్, పిల్లా రాము, నాయకులు మీసాల శ్రీను, సంచాన సత్యన్నారాయణ, రౌతు సతీష్, జగ్గరోతు సత్యన్నారాయణ, కనకం అప్పారావు, నాగం కనకరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top