మీకు ద‌మ్ముంటే రాజీనామాలు చేయండి

గూడూరు (నెల్లూరు):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రు చేరినా రాజీనామాలు చేసి చేరుతున్నార‌ని, టీడీపీ ఎవ‌రు చేరినా వారి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికార ప్ర‌తినిధి నాశిన నాగులు అన్నారు. టీడీపీ నేత‌ల‌కు ద‌మ్మూ ధైర్యం ఉంటే వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని స‌వాల్ చేశారు. స్థానిక రోడ్లు భ‌వ‌నాలు శాఖ అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండగా, డీసీసీ పదవిని తృణపాయంగా వదులుకుని జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచిన ఎల్లసిరి గోపాల్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఎవ‌రికీ లేద‌న్నారు. బాబు దేవాలయాలను, మసీదులను కూలుస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Back to Top