మహాధర్నా విజయవంతం చేద్దాం

చెన్నేకొత్తపల్లి: ఈ నెల 6న ఉరవకొండలో జరిగే మహాధర్నాకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ మండల కన్వీనర్‌ మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాలో పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. హంద్రీనీవా ద్వారా జిల్లాలో దాదాపు 3.5 లక్షల ఎకరాలకు సాగునీరును ఇవ్వాలనే డిమాండ్‌తో ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 

Back to Top