‘వైయ‌స్‌ఆర్‌ కుటుంబం’లో చేర్పిద్దాం

ఆదోని :  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేర‌కు ప్ర‌తి ఒక్క‌రిని వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర్పిద్దామ‌ని పార్టీ రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శి గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.  ప్రజా సంక్షేమం, సమస్యల పరిష్కారం, పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైయ‌స్‌ఆర్‌ కుటుంబం’ కార్యక్రమం ఆదివారం ఆదోని పట్టణంలో ప్రారంభమవుతుందని  గోపాల్‌రెడ్డి, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, 37వ వార్డు పరిధిలోని రాయనగర్, పైకొట్టాల, దేవీనగర్‌ ప్రాంతాలలో కొనసాగుతుందని చెప్పారు. ఆ వార్డు కౌన్సిలర్, నాయకులతోపాటు కార్యకర్తలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top