చెట్లను పెంచుదాం..పర్యావరణాన్ని కాపాడుకుందాం

గుంతకల్లు టౌన్: ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలను నాటి వాటిని బాధ్యతగా పెంచాలి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని 28వ వార్డు వైయస్సార్‌సీపీ కౌన్సిలర్‌ మాల రంగన్న తెలిపారు. సోమవారం ఎస్‌జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛభారత్, పచ్చని చెట్లు–ప్రగతికి మెట్లు అనే నినాదాలతో విద్యార్థుల చేత ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీను కౌన్సిలర్‌ రంగన్న ప్రారంభించారు. చుట్టుపక్కల కాలనీల్లో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి చెట్లను పెంచాలని, బడిఈడు పిల్లల్ని తప్పనిసరిగా బడికి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కోమలాదేవి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ షబానా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top