నంద్యాల స్థానాన్ని వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దాం

నంద్యాల: శిల్పా మోహన్‌ రెడ్డి నిజాయితీగా ఉండాలనే ఉద్దేశ్యంతో.... అన్నింటిలో నంద్యాలను ముందుంచాలనే తాము ముందుకు వచ్చామని పార్టీ నాయకురాలు దేశం సులోచన అన్నారు. ప్రజలకు అండదండలు అందించే వారికి కాకుండా..బాబు దోచుకునే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మేం టీడీపీని వదిలి వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చాం. ఇదే ప్రభంజనాన్ని ఉప ఎన్నికల్లో చూపాలని కోరుతున్నాను. నంద్యాలను గెలిచి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దాం. ఆగస్టు 23న అందరు ముందుకు వచ్చి శిల్పాకు ఓట్లు వేయాలని కోరుతున్నాను. ఉప ఎన్నిక అని ఇవాళ హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో నేను ఎప్పుడు లేని విధంగా రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. వైయస్‌ జగన్‌ వస్తే మరింత అభివృద్ధి చేస్తా.

తాజా ఫోటోలు

Back to Top