వైయస్ జగన్‌కు తోడుగా పోరాటం చేద్దాం

ప్రొఫెసర్‌ రమణారెడ్డి
ప్రత్యేక హోదా అనంతపురం జిల్లాకు చాలా అవసరం. కరువు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇరిగేషన్, పరిశ్రమలు రావాల్సిందే. పన్ను రాయితీలు, ప్రత్యేక గ్రాండ్స్‌ వస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఇవన్ని జరిగినప్పుడే మన జిల్లా అభివృద్ధి చెందుతోంది. పన్ను రాయితీలు ఎక్కడైతే లభిస్తాయో సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కూడా బాగుపడుతోంది. ప్రత్యేక హోదా మన హక్కు..మన సంజీవని, ఇందుకోసం వైయస్‌ జగన్‌ ఒక్కరే కాదు..మనం కూడా ఆయనకు తోడుగా పోరాటం చేద్దాం. హోదా కోసం చంద్రబాబు పోరాటం చేయడం లేదు.
–––––––––––––––––––
 జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం
ప్రోఫెసర్‌ సదాశివరెడ్డి
ఈ రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో ఎవరూ కూడా ప్రత్యేక హోదా కావాలని అడగలేదు. నాటి పాలకులు, ప్రతిపక్షాలు అడిగాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి, నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచి, అసెంబ్లీలో రెండు సార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పెద్దలు , ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదని చెబుతున్నారు. అంటే ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారు. అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన స్థలం, అలాంటి చోట తీర్మానం చేసి మాట తప్పితే మిమ్మల్ని జనం క్షమించరు. ప్రత్యేక హోదా కోసం అన్ని పోరాటాలు చేశాం. అయినా ఈ ప్రభుత్వాలు మొద్దు నిద్రలోఉన్నాయి. నిద్రమత్తును దించాల్సిన అవసరం ఉంది. యువతరం అనుకుంటే సాధించలేనిది ఏమి లేదు. అస్సాంలో ఇలాంటి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచారు. ప్రత్యేక హోదా తప్పక వస్తుంది. వైయస్‌ జగన్‌పైనే మేమంతా ఆశలు పెట్టుకున్నాం. జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం. ఇందుకోసం ఒక ఐక్య పోరాటం చేద్దాం.
...............................................
పోరాడితే ప్రత్యేక హోదా సాధ్యంః సోమశేఖరరెడ్డి
ప్రత్యేక హోదా వస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు యువత ముందుకు రావాలి. పోరాడితేనే సమస్య సాధించుకోగలం. యువకులారా మేల్కోండి. తప్పకుండా ప్రత్యేక హోదాను సాధించుకుందాం. వైయస్‌ జగన్‌కు ఒక మనవి..ఇంజీనీర్‌ విద్యార్థులు 80 వేల మంది జిల్లాలో ఉన్నారు. ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ చదవిన వారు ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు లేకపోవడంతో రోడ్లపై తిరుగుతున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే వీరందరికీ ఉపాధి సాధ్యమవుతుంది. 


Back to Top