ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం..హోదా సాధించుకుందాం

హైదరాబాద్ః  ఏపీకి ప్రత్యేకహోదా కోసం చేసే ఏ పోరాటాన్నైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ కదిలిరావాలన్నారు. ముఖ్యంగా యువత ముందుకొచ్చి మద్దతు ఇవ్వాలన్నారు. అందరం కలికట్టుగా పోరాడి ప్రత్యేకహోదాను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా తన సందేశం పంపారు. 

ప్రత్యేకహోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 26న వైయస్సార్సీపీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అందరూ కలిసివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. 

తాజా ఫోటోలు

Back to Top