టీడీపీ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటాం

చిత్తూరు(గుర్రంకొండ): టీడీపీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటామని, ఎన్ని కుట్రలు  చేసినా వైయస్సార్సీపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయులేరని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.  గుర్రంకొండ మండలంలోని సరివుడుగులో ఏర్పాటుచేసిన సవూవేశంలో వారు మాట్లాడారు. 70 ఇళ్ల కాలనీలో కేవలం  ఒక్క వైయస్సార్‌సీపీ నేత ఇంటినే కూల్చడం దారుణమని, దీనిపై ప్రశ్నించిన చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అన్యాయుంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. బెరుుల్‌పై విడుదలైన తర్వాత తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ.. ఆర్డీవో కార్యాలయుం ఎదుట శాంతియుుతంగా ధర్నా చేస్తే తప్పుడు కేసులతో మరోసారి అరెస్ట్ చేయుడం టీడీపీ దౌర్జన్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. 


పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ని టీడీపీ నేతలు కులంపేరుతో దూషించి దౌర్జన్యానికి దిగినప్పుడు ఇదే పోలీసులు ఎక్కడున్నారని నిలదీశారు. వైయస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి టీడీపీ వైపు తిప్పుకోవాలని ప్రయుత్నిస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.  మరికొంతవుంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ గ్లోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.  సమావేశంలో రాష్ట్ర మైనార్టీసెల్ కార్యదర్శి జమీర్ అలీఖాన్, ఎంపీపీలు నక్కాచంద్రశేఖర్, వుహితాఆనంద్, అరుణవ్ము, వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు రెడ్డిభాషా, రామచంద్రయ్య, శ్రీవళ్లి, తదితర పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 

తాజా వీడియోలు

Back to Top