అందరం కలిసుందాం..!

  • కొందరి తప్పుకు కులాల మధ్య చిచ్చుపెట్టడం దారుణం
  • బాధ్యులను ముందే అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు
  • గ్రామాన్ని ఒక్కటి చేయడం కోసమే గరగపర్రుకు వచ్చాం
  • కులం పేరుతో విడిపోవడం సరికాదు
  • అందరం కలిసికట్టుగా ఒకే గ్రామంలో ఉండాలి
  • గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుదాం
  • సమస్య పరిష్కారానికి ఇరువర్గాలతో వైయస్ జగన్ భేటీ
పశ్చిమ గోదావరి: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే గరగపర్రు వివాదం ఇంతదూరం వచ్చిందని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ అన్నారు. ప్రతిపక్షనేత వస్తున్నాడనే భయంతో గరగప్రరు విగ్రహ వివాదంలో కొందరిని అరెస్టులు చేయడం జరిగిందని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బాధ్యులను ముందే అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు.  కులాల మధ్య వైరంలో ఒక ఎస్‌ఐని, ఎమ్మార్వోను సస్పెండ్‌ చేశారంటే తప్పు జరిగిందనే కదా అర్థమని  వైయస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో తలెత్తిన వివాదం కారణంగా గరగపర్రులో పర్యటించిన వైయస్ జగన్ ఇరు వర్గాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. అందరం కలిసుందామని పిలుపునిచ్చారు. అదే సమయంలో దళితులతో కలిసి వైయస్ జగన్ భోజనం చేశారు.  

అనంతరం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ గ్రామంలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి, గ్రామాన్ని ఒకటి చేయడం కోసం గరగప్రరుకు రావడం జరిగిందన్నారు. కులం పేరుతో విడిపోవడం సరికాదని ఇరు వర్గాలకు చెప్పడం జరిగిందన్నారు. వివక్ష జరిగింది కాబట్టే పరిస్థితులు ఈ రకంగా కారణమయ్యాయన్నారు. బాధకరమైన సంఘటనల మధ్య విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. ప్రతి కులంలో మంచి, చెడు రెండూ ఉంటాయన్నారు. ఇరు వర్గాలతో మాట్లాడిన తరువాత అందరం కలిసికట్టుగా ఒకే గ్రామంలో ఉండాలి, సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలని గ్రామస్తులంతా కోరుకుంటున్నారని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కొద్ది మంది తప్పిదం వల్ల సమస్య ఏర్పడితే వారిపై మాత్రమే యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. 

న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం విచారణ జరిగిన తరువాత ఎస్‌ఐని, ఎమ్మార్వోను సస్పెండ్‌ చేయడం జరిగిందంటే కొంతమంది తప్పు చేశారనే కదా అని వైయస్‌ జగన్‌ అన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా కొందరిని అరెస్టు చేశారు సంతోషమని అన్నారు.  కొందరు చేసిన తప్పుకు కులాల మధ్య చిచ్చు పెట్టడం దారుణమన్నారు. గ్రామస్తులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మోషన్‌బాబు, స్రరాజులు ఒక కమిటీగా ఏర్పడి ఇరు వర్గాలతో మాట్లాడతారన్నారు.  ఊరును పూర్తిగా ఒకటి చేసేందుకు సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పుకు గ్రామం కులాలు, మతాల పరంగా చీలిపోయే పరిస్థితి రాకూడదన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నింపేందుకు మనమంతా నాలుగు అడుగులు ముందుకు వేయాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top