గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం

అనంతపురం:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందామని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి  అన్నారు. మంగళవారం ఉరవకొండలోని తొగటవీరక్షత్రియ కళ్యాణ మండపంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన రెండున్నర యేళ్ల కాలంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైయిందన్నారు. చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధాని, రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ మభ్యపెట్టడమే కాకుండా రుణమాఫీ అంటూ రైతులు, మహిళా సంఘాలను మోసగించారని తెలిపారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్షం లేకుండా చేస్తానంటూ చెప్పడం హస్యస్పందగా వుందని, మరో కొన్ని రోజులు పోతే ప్రజలే అధికార పార్టీని లేకుండా చేస్తారని తెలిపారు. కొన్ని రోజుల క్రితం జిల్లా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు జరిపిన సమావేశంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రూ 2వేల నిరిద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం లాంటి హమీలు ఇచ్చి మోసగించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల వరుకు ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని, ఇందులో అరకొర నోటిఫికేషన్లు జారీ చేసి నిరిద్యోగులకు బాబు మభ్యపెడుతున్నారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా బాబు ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని తాకెట్టు పెట్టారని తెలిపారు. అనంతపురం జడ్పీ ప్లోర్‌ లీడర్, జడ్‌పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి మాట్లాడుతూ వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు సహకరించి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్‌పీటీసీలు తిప్పయ్య, లలితమ్మ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు బసవరాజు,  కాకర్లనాగేశ్వరావు,  అశోక్, పార్టీ మండల కన్వీనర్లు నరసింహులు, శ్రీనివాసులు, జయేంద్రరెడ్డి, ఉరవకొండ పట్టణ అభివృద్ధి కమీటి అధ్యక్షులు ఎ్రరిస్వామి, మిడతల చంద్రమౌళి, ఎంసీ నాగభూషణం, సింగల్‌ విండో అధ్యక్షులు శివలింగప్ప, లత్తవరం గోవిందు,  మాజీ ఎంపీపీ ఎసీ ఎ్రరిస్వామిలు పాల్గొన్నారు.  

Back to Top