అధినేతకు ఘన స్వాగతం పలుకుదాం

గోకవరం:వైయస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఎజెన్సీ పర్యటనకు వెళుతున్న దృష్ట్యా గోకవరంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని జగ్గంపేట నియోజకవర్గ వైయస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. గోకవరంలో ఆయన స్వగృహంలో మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏజెన్సీలో విలీన మండలాల పర్యటనలో భాగంగా వైయస్ జగన్ గోకవరం మండలం మీదుగా వెళ్తున్నారని తెలిపారు. 

ఇందు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గూర్చి చర్చించారు. పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి వరసాల ప్రసాద్‌ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు క్రరి సూరారెడ్డి, ముత్యం నాని, నరాలశెట్టి నర్శయ్య, దంగేటి వెంకటరత్నం, దాసరి చినధర్మరాజు, బద్దిరెడ్డి రెడ్డియ్య, ఉంగరాల ఆదివిష్ణు, కుమ్మరపూడి అప్పారావు, గౌడు లక్ష్మి, నాగేశ్వరరావు, కృష్ణ, గోవిందరెడ్డి, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
 
Back to Top