యండపల్లెను గెలిపిద్దాం

పీలేరు: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న యండపల్లె శ్రీనివాసులరెడ్డిని గెలిపిద్దామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ మార్చి 9వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉద్యమనేత, నిగర్వి అయిన శ్రీనివాసులరెడ్డిని గెలిపించాల్సిన గురుతర భాద్యత మనందరిపైనా ఉందన్నారు. కార్పొరేట్‌ శక్తుల నుంచి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

Back to Top