వెన్న‌పూస గోపాల్‌రెడ్డిని గెలిపిద్దాం

అనంత‌పురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపిద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ కోరారు. బుధ‌వారం గోపాల్‌రెడ్డి త‌ర‌ఫున ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఆమె ప్ర‌చారం నిర్వ‌హించి ఓట్లు  అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ..గోపాల్‌రెడ్డికి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలపై బాగా అవగాహన ఉంద‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకుంటే చంద్రబాబు మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఆయన్ను శాసనమండలికి పంపేందుకు ప్రతి త‌మ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.   

Back to Top