పార్టీ ప్లీనరీ విజయవంతం చేయండి

వైయ‌స్ఆర్ జిల్లా: ఈ నెల 2న నియోజ‌క‌వ‌ర్గ‌ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్‌ ఎం సుధీర్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ నిర్వ‌హిస్తున్న‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ‌మ్ముల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ప్లీన‌రీ స‌మావేశాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డి, పార్టీ ట్రైడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి పిలుపునించారు. గురువారం ఎర్ర‌గుంట్ల పార్టీ కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం స్వర్ణయగంగా మారి అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం టీడీపీ పాలని అన్ని వర్గా ప్రజలు విసుక్తి పోయిన్నారని విమర్శించారు. పేదలకు ఇచ్చిన రేషన్‌లో కూడాలో కోతలు విధించారని చెప్పారు. చక్కెర, కిరోసిన్‌ ఇవ్వకుండా కేవలం బియ్యం ఇస్తున్నారని దీని బట్టి తెలుస్తోంది టీడీపీ పాలన ఎలాంటిదో అని విమర్శించారు. ఈ టీడీపీ పాలనలో పాలకులు ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు.

Back to Top