``ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌``ను విజ‌య‌వంతం చేద్దాం

ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌య్యేందుకే ``ప్ర‌జా సంక‌ల్పం``
* ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి అర్బన్ (క‌డ‌ప‌):  ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ``ప్ర‌జా సంక‌ల్పం`` పాద‌యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా బీసీసెల్ కార్యదర్శి విజయభాస్కర్‌ ముద్రింపచేసిన ప్రజాసంకల్పయాత్ర పోస్టర్లను ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గుండె లోతుల్లో నుంచి పుట్టుకువచ్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజాసమ స్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తోందన్నారు. కాగా టీడీపీ నేతలు మాత్రం అవినీతి,అక్రమాలకు పాల్పడుతూ కోట్లుదండుకుంటూ ఆస్థులను కూడబెట్టుకుంటున్నట్లు ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్ని స్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై ఎదురుదాడికి దిగుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విమర్శిం చారు. వీలైనచోట్ల పార్టీనేతలు కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారపక్షం సాగిస్తున్న ఆరాచకం, అక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళేందుకే వైయ‌స్‌జ‌గ‌న్ పాద‌యాత్ర త‌ల‌పెట్టిన‌ట్లు వివ‌రించారు. 
................................................


పెనగలూరు (క‌డ‌ప‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి చేప‌ట్ట‌బోయే ``ప్ర‌జా సంక‌ల్పం``యాత్ర‌ను విజ‌యంతం చేయాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీ‌నివాసులు, జిల్లా అధ్య‌క్షులు ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డిలు అన్నారు. బుధవారం ఎగువసిద్దవరంలోని లేబాక శ్రీనివాసులురెడ్డి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరై  మండలస్థాయి కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ ప్రారంభించనున్న సంకల్పయాత్రకు మండలం నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. పాదయాత్రను మండలంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ ఆధ్వర్యంలో ప్ర‌జా సంకల్పయాత్రకు ప్రజలు తరలిరావాలన్నారు.  గతంలో రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్రలో రైతులు, పేదల పరిస్థితులను అవగాహన చేసుకుని అభివృద్దిపథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికూడా రైతులు, పేదప్రజల సమస్యలు తెలుసుకుని వారిసమస్యలకు అనుగుణంగా పథకాలను ప్రారంభిస్తారని వారన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించేందుకుకూడా ఈ పాదయాత్ర దోహదపడుతుందన్నారు. మండలంలోని ప్రతికార్యకర్త వైయ‌స్ జ‌గ‌న్ వెంట న‌డిచేందుకు కృషిచేయాలన్నారు. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు జగన్‌వెంటే ఉండి ఇప్పటినుంచే పార్టీ అభివృద్ధికి కృషిచేయాలన్నారు.

...............................................
ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకే ``ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌``
* జిల్లా అధ్య‌క్షులు ఆకేపాటి అమ‌ర్‌నాథ్ రెడ్డి
ఒంటిమిట్ట (క‌డ‌ప‌): చ‌ంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల క‌ష్టాలు తీవ్ర త‌ర‌మ‌య్యాయ‌ని, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌న్న ధ్యాస చంద్ర‌బాబు నాయుడికి లేనేలేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఒంటిమిట్ట హరిత హోటల్‌లో మండల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి పరిపానలతో పార్టీలకు కులమతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు మేలుజరిగిందని అన్నారు. అలాంటి పరిపాలన రావాలంటే ఎలాగైనా 2019లో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతిఒక్క కార్యకర్త పార్టీబలోపేతంకోసం విజయం దిశగా తీసుకెళ్లడానికి శక్తివంచనలేకుండా కృషిచేయాలని అన్నారు.
.............................................................
`ప్ర‌జా సంక‌ల్పం`` విజ‌య‌వంతం కావాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు
*వైవీఆర్ ఆధ్వ‌ర్యంలో మూడు కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌
గుత్తి (అనంత‌పురం): వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి చేప‌ట్ట‌నున్న ``ప్ర‌జా సంక‌ల్పం`` పాద‌యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ బుధ‌వారం గుత్తిలో గుంత‌క‌ల్లు స‌మ‌న్వ‌య‌క‌ర్త వై.వెంక‌ట‌రామిరెడ్డి  మూడు దేవాల‌యాల్లో ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హించారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. కోటలోని నగరేశ్వరాలయం వద్ద నుంచి కొండపై ఉన్న దిడ్డి ఆంజనేయస్వామి దేవాలయం వరకు అటు నుంచి తిరిగి లక్ష్మినరసింహస్వామి దేవాలయం వరకు, అటు నుంచి నగరేశ్వరాలయం వరకు సుమారు మూడు కిలో మీటర్ల మేర నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. మొదట అతిపురాతనమైన దిడ్డి ఆంజనేయస్వామి దేవాలయంలో జగన్‌ పాదయాత్రకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మినరసింహస్వామి, నగరేశ్వరాలయం(శివాలయం)లలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైవీఆర్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. చంద్రబాబను ఇంటికి పంపడానికి రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నదన్నారు. Back to Top