పార్టీ స్లీన‌రీ మ‌హాస‌భ‌ను విజ‌య‌వంతం చేద్దాం

బెళుగుప్ప: నియోజకవర్గ మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప‌రిష్కారంలో భాగంగా  కూడేరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించే పార్టీ నియోజకవర్గ ప్లీనరీ మహాసభను విజయవంతం చేద్దాం అని ఆ పార్టీ మండల నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్‌ శ్రీనివాస్, బెళుగుప్ప సర్పంచ్‌ రామేశ్వరరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్‌లు తిమ్మారెడ్డి, ఉప్పర నారాయణస్వామి, పార్టీ ఎస్సీసెల్‌ మండల కన్వీనర్‌ తిప్పేస్వామి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో నెలకొన్న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను  ప్లీనరీ మహాసభలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెల్లి చర్చించి రాష్ట్ర స్థాయిలో ప్రస్థావించే విధంగా  చేద్దాం అని పేర్కొన్నారు. ఇప్పటికే మండలంలో ప్రదాన సమస్య అయిన హంద్రీనీవా మొదటిదశ ఆయకట్టుకు సాగునీటి కోసం గత యేడాది బెళుగుప్పలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో జలజాగరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మండలంలో ప్రజాసమస్యలైన రుణమాఫీ అమలు. సాగునీరు, పించన్‌లు, నిర్వీర్యం అవుతున్నాయి. నిత్యావ‌స‌ర స‌రుకుల  వ్యవస్థ, గృహాల మంజూరు, రాయితీ రుణాలు తదితర అంశాలను ప్లీనరీ మహాసభ దృష్టికి తీసుకువెలతామన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈమహాసభకు పార్టీ మ‌ద్ద‌తు దారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ మండల కమిటీల నాయకులు తదితరులు తరలివచ్చి జయప్రదం చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కేసి తిప్పేస్వామి. నరిగన్న తదితరులు పాల్గొన్నారు.
పీవీ సిద్ధారెడ్డి ఆధ్వ‌ర్యంలో...
కదిరి టౌన్‌: పట్టణంలోని దత్తా గార్డెన్‌లో రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీ.వీ.సిద్దారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబోయే వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేద్దామని వైఎస్సార్‌ విద్యార్థి సంఘం నాయకులు చంద్రశేఖర్, వశీంఖాన్, మహేష్‌లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు, గుండాయిజాలు పేట్రేగి పోతున్నాయ‌న్నారు.  పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కూడా వారికి అందుబాటులో లేకుండా నిర్వీర్యం అవుతున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం ఆర్భాటానికి చెప్పుకోవ‌డానికి త‌ప్ప  పేదలకు ఏ విధంగా కూడా ఉపయోగపడలేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా ప‌ద్ద‌తి మార్చుకోక పోతే  ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ చేతకాని తనాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఫ్యాన్‌ గాలి వీస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ప్లీనరీని విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ  కార్య‌క‌ర్త‌లు,అభిమానులు  
కూడేరులో...
కూడేరు: కూడేరులోని హనుమాన్‌ రైస్‌ మిల్‌లో శుక్రవారం వైఎస్సార్‌ సీపీ ఉరవకొండ నియోజక వర్గ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఏర్ఫాట్లు స‌ర్వం పూర్తి అయ్యాయి. గురువారం ఏర్ఫాట్ల పనులను ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి , ఆయన తనయుడు వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణయ్‌ కుమార్‌ రెడ్డి , పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్నలు పర్యవేక్షించారు. సమావేశానికి హాజ‌రైన  నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మండల నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సంధర్భంగా ఏర్ఫాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్లీనరీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, జిల్లాలోని వివిధ నియోజక వర్గాలకు చెందిన పార్టీ సమన్వయ కర్తలు హాజరు అవుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్లీనరీలో గత మూడేళ్ళ నుంచి వైఎస్సార్‌ సీపీ తరుపున ప్రజా సంక్షేమం కోసం నియోజక వర్గంలో చేపట్టిన పోరాటాలు గురించి చర్చించడం జరుగుతుందన్నారు. అలాగే ఇంకా ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలిచి ప్ర‌భుత్వంపై  చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి , పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి భవిష్యత్‌ ప్రణాళికను సిద్దం చేసుకోవడం జరుగుతుందన్నారు. కావున నియోజక వర్గంలో 5 మండలాలకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులు, బూత్‌ కమిటితో మొదలు ఇతర క్యాడర్ల నాయకులంతా తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మాదన్న, తిమ్మారెడ్డి, శశికాంత్‌రెడ్డి, విజయ భాస్కర్‌ రెడ్డి, బొజ్జన్న, శంకర్‌ రెడ్డి, నారాయణరెడ్డి, గోవింద్, మురళి, క్రిష్టప్ప, శంకర్‌ నాయక్, లక్ష్మినరసప్ప, ఎర్రిస్వామి, రంగారెడ్డి రామాంజనేయులు, తిరుపతయ్య ,చిదంబరం, పుల్లన్న, కొండాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Back to Top