వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ విజయవంతం చేయాలి

వైయస్‌ఆర్‌ జిల్లా: ఈ నెల 6న కడప జయరాజా గార్డెన్స్‌లో నిర్వహించే వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ మండల కన్వీనర్‌ జీఎన్‌ భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానికకార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బూత్‌ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి కమిటీ సభ్యులు ప్లీనరీకి హాజరు కావాలన్నారు. పింఛన్లు, పక్కా గృహాల మంజూరు, రుణమాఫీ కాని అర్హుల జాబితాను ప్లీనరీలో అందజేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ సుబ్బారెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చీర్ల సురేష్‌యాదవ్, నాయకులు నీలం శ్రీనివాసరెడ్డి, అబ్దుల్‌ రబ్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top