బాబు పాలనను అంతం చేద్దాం

  • చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారు
  • మహేష్ ను గురజాలకు పరిచయం చేస్తున్నా ఆశీర్వదించండి
  • గురజాలలో టీడీపీ దురాగతాలకు అంతు లేకుండా పోయింది
  • జంగన్న నాకు నాన్నలాంటి వారు..చట్టసభల్లోకి తీసుకొస్తా
  • ఎన్నాళ్లు బతికామన్నది కాదు ఎలా బతికామన్నది ముఖ్యం
  • చేయి చేయి కలుపుదాం మోసపూరిత ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం
  • నరసరావుపేట బహిరంగసభలో వైయస్ జగన్ ప్రసంగం
నరసరావుపేట:  చంద్రబాబు పాలనతో ప్రజలు విసుకు చెందారని, అందరం ఒక్కటై చేయి చేయి కలిపి టీడీపీ పాలనను అంతం చేద్దామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్టారెడ్డి కుమారుడు కాసు మహేష్‌ రెడ్డి శుక్రవారం వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పల్నాటి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై నినాదాలతో హోరెత్తించారు. జన ప్రభంజనంతో నరసరావుపేట రెడ్డి కాలేజ్‌ గ్రౌండ్‌ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ చంద్రబాబు మోసాలను ఎండగడుతూ..పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. 

వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ఈ రోజు మహేష్‌ను మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. తోడుగా నీవు రా మహేష్‌..అన్నగా తోడుగా నిలబడతా అన్నాను. చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారు. బాబు మోసాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మోసపూరిత పాలనకు అడ్డుకట్ట వేయాలంటే మనమందరం ఒక్కటి కావాలి. అందులో భాగంగానే మహేష్‌ నీలాంటి యువకులు రావాలి. తోడుగా నిలబడు..అన్నగా అండగా ఉంటా అని పిలిచాను. నరసరావుపేటలో మహేష్‌ వచ్చినందు వల్ల కన్యూఫూజన్‌ వస్తుందని టీడీపీ నేతలు ఆనందంగా ఉన్నారు. ఇక్కడ కన్‌ఫ్యూజన్‌ రానే రాదు. కారణం ఏంటంటే మహేష్‌ను తీసుకునేముందు  జంగన్నతో మాట్లాడా..బాబు పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారు. ఇవాళ అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అడిగాను. నేను జంగన్న ఇద్దరం కలిసి ఆలోచన చేశాం. గురుజాలలో ఇవాళ టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న దురాగతాలకు అంతులేకుండా పోయింది. పూర్తిగా రౌడీయిజంతో పాలన సాగిస్తున్నారు. ఇలాంటి పాలనకు అడ్డుకట్ట వేసేందుకు మహేష్‌ను గురుజాలకు పరిచయం చేస్తున్నాం. నా తమ్ముడిలా నిలబడుతున్నాడు. ఆశీర్వదించండి. నరసరావుపేటకు మీకు పరిచయం ఉన్న డాక్టర్, సౌమ్యుడు గోపిరెడ్డి తోడుగా ఉంటారు. జంగన్న వంటి వ్యక్తులు నాకు నాన్నలాంటి వ్యక్తులు. ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేసిన ఆరుమాసాలకే నా పక్కన కూర్చోబెట్టుకుంటా. చట్టసభలోకి తీసుకెళ్తా. 

రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాన్న కూడా ఒక మాట చెప్పేవారు. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు. ఎలా బతికామన్నదే ముఖ్యం. అబద్దాలు చెప్పి, మోసం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి వద్దు అని ప్రతి యువకుడు, అవ్వ తాత, అక్కాచెల్లేమ్మలు చేతులెత్తి చెబుతున్నారు. చంద్రబాబును చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన నాయకత్వం అక్కడ ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు రైతులు, మహిళల రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గోడల మీద రాతలు రాశారు. టీవీల్లో అడ్వర్‌టేజ్‌మెంట్లు ఇచ్చారు. అడ్డగోలుగా రైతన్నలను మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నారు. నోటీసులు పంపుతున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మాట తప్పారు.చదువుకున్న పిల్లలను, ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులను వదలలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. సీఎం అయ్యాక నిరుద్యోగ భృతి ఏది అంటే సమాధానం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు..మోసం. రాష్ట్రం కోసం ప్రజలకోసం తోడుగా నిలబడాల్సిన సీఎం రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేశారు. 

పై రాష్ట్రంలో నీరు అటునుంచి అటే తోడుకునే పోతుంటే అడిగే పరిస్థితి లేదు. కారణం తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు లంచం ఇస్తూ అడ్డగోలుగా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారు. ఇవాళ ఆ ఆడియో టేపులు బయటపెడతారేమో అని నీళ్ల విషయంలో అడగడం లేదు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే చంద్రబాబు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదు. కారణం మోడి అంటే బాబుకు వణుకు. బాబు గట్టిగా నిలదీస్తే..రెండేళ్లలో చేసిన అవినీతిపై సీబీఐ విచారణ వేస్తారని భయం. బాబు పాలనలో రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఇటువంటి చంద్రబాబు పాలనను అంతం చేయాలంటే అందరం కలిసికట్టుగా ఒక్కటవ్వాలి. మోసం చేస్తే ఊరుకోమని గట్టిగా సంకేతాలు ఇవ్వాలి. ఎవరైనా మోసం చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కూడా బాబు చేసిన మోసాలు, అబద్దాలు ఎత్తి చూపుతూ టీడీపీ పాలనను బంగాళాఖాతంలో కలుపుదాం. అందరం ఒక్కటవుదాం. తోడుగా నిలబడదాం. మహేష్‌ను ఆశీర్వదించాలని సవినయంగా చేతులు జోడించి పేరు పేరునా కోరుతున్నాను.
 
Back to Top