సార్వ‌త్రిక స‌మ్మెను జ‌య‌ప్ర‌దం చేద్దాం

కార్మిక వ‌ర్గ పొట్ట‌కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును నిర‌సిద్దాం.
 - సెప్టెంబ‌రు 2 సార్వ‌త్రిక స‌మ్మెను జ‌య‌ప్ర‌దం చేద్దాం. 
మేము అధికారంలోకి రాగానే అచ్ఛేదిన్ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెస్తాం... మేక్ ఇన్ ఇండియా పేరుతో స్వ‌దేశంలో వ‌స్తువుల‌ను త‌యారుచేసి విదేశాల‌కు అమ్మేవిధంగా ఏర్పాట్లు చేస్తాం.... అధిక ధ‌ర‌ల‌ను నేల‌కు దించుతాం... విదేశీ బ్యాంకుల్లోని న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీసి నిరుపేద‌ల కుటుంబాల్లో వెలుగులు నింపుతాం....ఇది ప్రధాని నరేంద్రమోదీ మాట
                                            
  నేను మారిన మ‌నిషిని... న‌న్ను న‌మ్మండి...బాబొస్తే... జాబొస్తుంది...నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా... అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు సాంఘీక భ‌ద్ర‌త క‌ల్పిస్తాం.... మ‌హిళ‌లంద‌రినీ అక్షాధికారుల‌ను చేస్తాం.....ఇది చంద్రబాబు మాట.
                                     
ఇవి మ‌న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిచోట ఊద‌ర‌గొట్టిన హామీలు. తీరా ఎన్నిక‌లైపోయాక కేంద్రంలో ప్ర‌ధాన మంత్రి ఉద్యోగాన్ని న‌రేంద్ర‌మోదీ , రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి ఉద్యోగాన్ని చంద్ర‌బాబు నాయుడు  సంపాదించేసుకున్నారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేసి ప్ర‌జా సంక్షేమాన్నిఅట‌కెక్కించారు. అధిక ధ‌ర‌ల నియంత్ర‌ణ ఊసే ఎత్త‌డం లేదు. అంతెందుకు స‌మాజానికి, దేశానికి సంప‌ద చేకూర్చే కార్మిక వ‌ర్గం ప‌ట్ల‌... దేశానికి వెన్నెముకగా ఉండే రైతుల ప‌ట్ల‌... దేశ సంప‌ద‌గా త‌యారు చేయాల్సిన యువ‌త ప‌ట్ల‌... ఇలా స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌మీద త‌మ క‌ర్క‌శ‌మైన దాడిని మొద‌లు పెట్టి తామేమీ మార‌లేద‌ని నిరూపించుకుంటున్నారు.
  కేంద్ర ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ రంగం, రైల్వేల‌తో స‌హా అన్ని కీల‌క రంగాల్లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను 100% వ‌ర‌కూ అనుమ‌తించ‌డం, లాభ‌న‌ష్టాల‌తో నిమిత్తం లేకుండా ప్ర‌భుత్వ‌రంగ ప‌రిశ్ర‌మ‌ల‌న్నింటినీ ప్ర‌యివేటీక‌రించుట‌కు విధాన‌ప‌ర‌మైన నిర్న‌యం తీసుకోవ‌డం, కార్మ‌క సంస్క‌ర‌ణ‌ల‌పేరిట మొత్తం కార్మిక‌ట్టాల‌న్నింటినీ కుదించి కార్మికుల హ‌క్కుల‌ను అణిచివేయ‌డంలాంటి చ‌ర్య‌లు కార్మికుల‌లో తీవ్ర ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తున్నాయి. గ‌త సెప్టెంబ‌రు 2వ తేదీన 15 ఓట్ల‌మంది కార్మికులు విజ‌య‌వంతంగా స‌మ్మె నిర్వ‌హించి మోదీ స‌ర్కార్ విధానాల‌ప‌ట్ల త‌మ తీవ్ర‌మైన నిర‌స‌న‌ను తెలిపిన‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు. ఉద్యోగ కార్మిక సంఘాలు స‌మ‌ర్పించిన 12కోర్కెల‌తో కూడిన విన‌తిప‌త్రం విష‌యంలో సంప్ర‌దింపులు జ‌రిపి ఒక ఒప్పందానికి వ‌స్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆనాడు న‌మ్మ‌బ‌లికింది. అయితే గ‌త సెప్టెంబ‌రు 2 స‌మ్మె త‌రువాత ఒక్క‌సారికూడా కార్మిక సంఘాల‌తో చ‌ర్చ‌లుగానీ, సంయుక్త స‌మావేశాలుగాని జ‌రుప‌లేదు. తాము కుదించ‌ద‌లుచుకున్న కార్మిక చ‌ట్టాల విష‌యంలో పున‌రాలోచ‌నే లేద‌ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ప‌దేప‌దే ప్ర‌క‌టిస్తున్నారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేష‌న్ అదుపుచేయ‌డం, స‌మ్మెను నిషేదించ‌డం, కార్మికుల‌ను ఇష్టానుసారంగా తొల‌గించ‌డంలాంటి దుర్మిర్గ‌మైన క్లాజుల‌ను కొత్త చ‌ట్టంలో పొందుప‌ర్చారు. క‌నీస వేత‌నం రూ.18వేలు, బ్యాంకులు, ఇన్సూరెన్సుల‌తోపాటు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ప‌రిర‌క్ష‌ణ, విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌పై ఆంక్ష‌లు, పి.ఎఫ్., పెన్ష‌న్., ఆరోగ్య సౌక‌ర్యాల‌తో కూడిన అసంఘ‌టిత‌రంగ కార్మికులు, ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తి సంద‌ర్భంలోనూ వ్య‌వ‌హ‌రిస్తుంది. 2015 మార్చిలో రాష్ట్రంలోని 5 ప్ర‌ధాన కార్మిక చ‌ట్టాల‌ను ఏక‌ప‌క్షంగా స‌వ‌రిస్తూ ప్ర‌భుత్వం శాస‌న స‌భ ద్వారా బిల్లును ఏక‌గ్రీవంగా ఆమోదింప‌చేశారు. దీనితో గ‌తంలో ఉన్న అనేక హ‌క్కుల‌ను కార్మికుల‌కు కోల్పోయారు. అదే స‌మ‌యంలో కార్మిక చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకునే అవ‌కాశాన్ని యాజ‌మానుల‌కు క‌ల్పించారు. ఆందోళ‌న‌చేస్తే పెట్టుబ‌డులురావ‌ని, ఆందోళ‌న‌లు, స‌మ్మెలు రాష్ట్రంలో ఉండ‌రాద‌ని, స‌మ్మె చేసేవారితో చ‌ర్చ‌లు ఉండ‌వ‌ని, ఆందోళ‌న‌కారుల‌ను ప్ర‌భుత్వం ఉక్కుపాదంతో అణ‌చివేస్తుంద‌ని ముఖ్య‌మంత్రిగారే స్వ‌యంగా ప‌దే ప‌దే చేస్తున్న‌ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌భుత్వ అధికారులు, పెట్టుబ‌డిదారుల‌కు మ‌రింత ఉత్సాహాన్నిస్తున్నాయి. విశాఖ జిల్లా బ్రాండెక్స్, అనంత‌పురం జిల్లా రావ‌తార్, నెల్లూరులోని కృష్ణ‌ప‌ట్నం పోర్టు, శ్రీకాళ‌హ‌స్తిలోని ల్యాంకో, శ్రీకాకుళం జిల్లాలోని అద‌బిందో, క‌డ‌ప, అనంత‌పురం క‌ర్నూలు జిల్లాలోని సిమెంటు ఫ్యాక్ట‌రీలు త‌దిత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో కార్మికుల‌పై, కార్మిక సంఘాల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు, క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు స్ఫూర్తి ఇక్క‌డినుంచే ప్రారంభం అవుతోంది. రాష్ట్ర రాజ‌ధాని విజ‌య‌వాడ న‌గ‌రంలో కార్మిక సంఘాలు శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేయ‌డానికి కూడా ప్ర‌భుత్వం అంగీక‌రించ‌డంలేదు. ధ‌ర్నాలో పాల్గొంటే ఉద్యోగాల నుండి తొల‌గించే విధంగా స్కీం వ‌ర్క‌ర్ల‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర ప్ర‌భుత్వం నేరుగా ఆదేశాలు ఇవ్వ‌డం ఈ ప్ర‌భుత్వ నిరంకుశ విధానానికి ప‌రాకాష్టగా అభివ‌ర్ణంచ‌వ‌చ్చు.

భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వ‌సూలు చేసిన సెస్సును త‌మ రాజ‌కీయ ప్ర‌చారానికి విచ్చ‌ల‌విడిగా వాడుకుంటున్నారు. చంద్ర‌న్న చ‌ల‌వ పందిళ్ళు, ప్ర‌జ‌లంద‌రికీ వేస‌విలో మ‌జ్జిగ ప్యాకెట్ల పంపిణీ, మేడే సంద‌ర్భంగా పారిశ్రామిక వేత్త‌ల‌కు స‌న్మానాలు, ట్రాన్స్ పోర్టు కార్మికుల భీమా స‌థ‌కం కొర‌కు చెల్లించిన ప్రీమియం, చంద్ర‌న్న భీమా ప‌థ‌కం ప్రీమియంతో స‌హా ప్ర‌భుత్వం త‌న రాజ‌కీయ ప్ర‌చారానికి చేప‌డుతున్న అన్ని ప‌థ‌కాల‌కు భ‌వ‌న నిర్మాణ కార్మికుల సెస్సు నిధిని విచ్చ‌ల‌విడిగా వాడ‌డాన్ని చూస్తే చంద్ర‌బాబు కార్మిక సంక్షేమానికి ఒక్క రూపాయి ఖ‌ర్చుపెట్ట‌క‌పోగా ఉన్న నిధుల‌ను త‌న సొంత డ‌బ్బాకొట్టుకునేందుకు ప‌ప్పుబెల్లాలా ఖ‌ర్చుపెడుతున్నారు. వంద‌ల కోట్ల‌మేర అవినీతికి తెర‌తీస్తున్నారు.

 బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని ఆశించిన యువ‌త‌కు ఈ పాల‌న తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది. ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖ‌ళీగా ఉన్నల‌క్ష ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌లేదు. అంతేకాకుండా ప్ర‌భుత్వ‌మే త‌న శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. గృహ నిర్మాణ శాఖ‌లోని వేలాదిమంది వ‌ర్క్ ఇన్ స్పెక్ట‌ర్లు, ఉపాధిహామీ శాఖ‌లోని ఫీల్డీ అసిస్ట్ంట్లు, స్త్రీ   శిశు సంక్షేమ శాఖ‌లోని వేలాదిమంది చిరుద్యోగులు, ఆరోగ్య‌మిత్ర‌, ఐకేపీ, రంగాల్లోని వేలాదిమంది ఉద్యోగులు త‌మ ఉపాధిని కోల్పోతున్నారు. అంతేకాక స్కీం వ‌ర్క‌ర్ల‌ను వేలాది మందిని ఏ సూత్రం లేకుండా తొల‌గించి త‌మ వారిని నియ‌మించేసుకుంటున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల పెర్రో ఎల్లాయిస్, జూట్, కో ఆప‌రేటివ్ షుగ‌ర్స్, పేప‌ర్ త‌దిత‌ర రంగాల్లో అనేక ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.  ఆ ప‌రిశ్ర‌మ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌కుగానీ, ఆ ప‌రిశ్ర‌మ‌ల‌లోని వేలాదిమంది కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కుగానీ, కార్మికుల‌కు త‌గిన న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించ‌డానికి కాని ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్యా తీసుకోలేక పోవ‌డం దారుణాతి దారుణం.
ప్ర‌బుత్వ రంగ ప‌రిశ్ర‌మ‌ల్లోని ఉద్యోగులు త‌మ‌కు ప్ర‌భుత్వం ఉద్యోగాల‌తో స‌మానంగా పిఆర్ సీని అమ‌లు చేయాల‌ని, 60సంవ‌త్స‌రాలు వ‌య‌సు వ‌ర‌కు ప‌నిచేసే అవ‌కాశాన్ని ఇవ్వ‌మ‌ని కోరుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ఉద్యోగుల‌తో ప్ర‌భుత్వానికి సంబంధంలేద‌ని, హైకోర్టులో అధికారికంగా ప్ర‌క‌టించి త‌న కార్మిక వ్య‌తిరేక వైక‌రిని స్ప‌ష్టం చేసింది. ల‌క్ష‌లాదిమంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ఎన్నిక‌ల వాగ్దాల‌నాల ప్ర‌కారం ప‌ర్మినెంట్ చేయ‌లేదు. 279, 26 త‌దిత‌ర జీవోల‌తో మునిసిప‌ల్ కార్మికులు, షాపు ఉద్మోగుల పై తీవ్ర‌మైన ప‌ని వ‌త్తిడిని క‌ల్పించి కార్మికుల‌ను వెట్టిచాకిరీ కార్మికులుగా త‌యారుచేస్తున్నారు.

య‌ధారాజా త‌ధా ప్ర‌జ‌
 ముఖ్య‌మంత్రి తీరుకు అనుగుణంగానే ఆయ‌న మంత్రివ‌ర్గం, మునిసిప‌ల్, కార్పొరేష‌న్ మేయ‌ర్లు త‌మ విధానాల‌ను కొన‌సాగిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో పుష్క‌ర ప‌నుల్లో టెండ‌ర్ల‌ను ద‌క్కించుకున్న మేయ‌ర్... అవినీతికి పాల్ప‌డి ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగ‌ప‌ర్చారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్  బాబు, ఆయ‌న మంత్రులు, గ్రామ స్థాయి  నుండి వివిధ హోదాల్లో ఉన్న ప్ర‌జా ప్ర‌తినిదులు అవినీతే ప‌ర‌మావ‌ధిగా ప‌నులు చేస్తూ ప్ర‌జ‌ల ర‌క్తాన్ని జ‌ల‌గ‌ల్లా తాగేస్తున్నారు. అయినకాడికి దండుకోవ‌డం, స‌హ‌క‌రించ‌ని అధికారులు, కాంట్రాక్ట‌ర్లు పైన దాడుల‌కు పాల్ప‌డ‌టం వీరికి అల‌వాటుగా మారింది. ఈ రాష్ట్రంలో అట‌విక పాల‌న సాగుతుంద‌న‌డానికి ఇదే పెద్ద నిద‌ర్శ‌నం. ప‌రిపాల‌న గాలికొదిలేసి ప్ర‌జా ప్ర‌తినిధులే వీధి రౌడీల్లా బ‌రితెగిస్తున్న సంఘ‌ట‌న‌లు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే క‌నిసిస్తున్నాయి.
Back to Top