జై ఆంధ్రప్రదేశ్ బహిరంగసభను జయప్రదం చేద్దాం

విశాఖపట్నంః వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నగరంలో జై ఆంధ్రప్రదేశ్ బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కరణం ధర్మశ్రీ, తైనాల విజయకుమార్, కర్రిసీతారాం, ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వచ్చే నెల ఆరున వైయస్సార్సీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అధ్యక్షులు వైయస్ జగన్ ఈకార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తారు. పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగసభలో  పాల్గొని విజయవంతం చేయాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు. 

                   

Back to Top