బాబుకు బాధితుల బాధలే పట్టడం లేదుపేదల భూములు లాక్కొని దివీస్ కు దోచిపెడుతున్నాడుఫ్యాక్టరీ మాకొద్దని రైతులు పోరాడుతుంటే కేసులు పెడుతున్నారుపోలీసులతో దాడులు..82 రోజులుగా గ్రామాల్లో 144 సెక్షన్ అండగా నిలబడిన రాజాపై 22 కేసులు పెట్టారుపేదల బతుకులతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించిన జననేతతూర్పుగోదావరి(దానవాయిపేట))గత 82 రోజులుగా మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు అని ఉద్యమ బాట పట్టినా..దీనివల్ల నష్టాలున్నాయని గట్టిగా చెప్పినా వినని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం దారుణమని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. బాధితులకు తోడుగా ఉండేందుకు ఎవరైనా వస్తే ఇవాళ కేసులు పెడుతున్నారు. 82 రోజులుగా ఈ గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఇన్ని రోజులు మీకు తోడుగా నిలిచినందుకు ఎమ్మెల్యే రాజాపై 22 కేసులు పెట్టారు. ఇందులో 7 కేసులు అటెంప్టు మర్డర్ కేసులట. అంతగా నిలబడినందుకు ఏకంగా హత్యయత్నం కేసులు పెట్టారు. ఇంతటి దారుణంగా వేధించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సీపీఎం నేత మధు ఇక్కడికి వచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వస్తే తనను కొట్టి వ్యాన్‌లోకి ఎక్కించారు పోలీసులు. నన్ను దారుణంగా కొట్టారని మధు సీఎంకు లేఖ రాస్తే పట్టించుకోలేదు. ఆడవాళ్లని చూడకుండా కొట్టి కేసులు పెడుతున్నారు. ఇంత దారుణంగా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ ఫ్యాక్టరీ వల్ల జరిగే ప్రమాదం ఏంటన్నది రాష్ట్రానికి తెలియజెప్పాలి. మనం పడుతున్న బాధల గురించి మీరే చెప్పండి. ఈ రాష్ట్రానికి వినిపించేలా. చంద్రబాబు గూబ గుయ్యుమనేలా..ఆయన మనసు మారేలా మన బాధను తెలుపుదామని వైయస్ జగన్ దివీస్ బాధితులతో ముఖామఖి నిర్వహించారు.
ముసలయ్యమేము ఇక్కడ రైతు కూలీ పనిచేస్తున్నాం. 36 కుటుంబాలు బీచ్‌పై ఆధారపడి బతుకుతున్నారు. కుళాయిలు లేవు. వేసవి కాలం కూడా చల్లని గాలులు వీస్తాయి. నిత్యం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పిల్లలు పుట్టరట. ఎదురు తిరిగితే ఎట్రాసిటి కేసులు పెడుతున్నారు, హింసిస్తున్నారు..ఆడవారని కూడా చూడకుండా పిటాపురం ఎస్ఐ కొట్టాడు. ఏ మేము తిరిగి కొట్టలేమా....? కానీ ఆ డ్రెస్ కు విలువ ఇచ్చి ఊరుకున్నాం. నానా హింసలు పెడుతున్నారు.
వైయస్ జగన్: ఈ ఫ్యాక్టరీ చుట్టు 250 హెచరీస్ ఉన్నాయి. ఒక్కో హెచరీలో దాదాపు 100 మందికి ఉపాధి కల్పిస్తోంది. చుట్టు ప్రక్కల్లోనే 20 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీళ్లందరూ కూడా బతికే పరిస్థితి ఏంటంటే..హెచరీస్‌లో పని దొరుకుతుంది. ఇటువంటి జోన్ దేశంలో ఎక్కడా లేదు. ఆసియాలో కూడా ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతుంది. దేశం మొత్తానికి సీ ఫుడ్ ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. రొయ్యల ద్వారా ప్రభుత్వానికి రూ.23 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఆక్వా కల్చర్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. ఇక్కడ చిన్న రొయ్యలు ఉత్పత్తి కాబట్టే అంత ఆదాయం వస్తుంది. సగం సీడ్ ఈ ప్రాంతం నుంచే వస్తుంటే ఏపీకి రూ.14 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇంత ప్రాధాన్యత గల రంగాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ రంగంలో ఉన్న హెచరీస్‌ను కాపాడాలన్న ఆలోచన చేయాలి. చిన్న చిన్న రొయ్య పిల్లలు పుడుతాయి. ఇవి మంచి వాతావరణంలో పెరుగుతాయి. ఇలాంటి వాతావరణం కావాలంటే సముద్రతీరంలో సాధ్యం. దివీస్ ఫ్యాక్టరీ నుంచి రసాయన నీరు సముద్రంలోకి వదులుతారు. ఈ హెచరీస్ బతకడానికి సముద్రం నీరు కావాలి. అయితే దివీస్ ఫ్యాక్టరీ యాజమాన్యం బతికేందుకు సముద్రాన్ని కలుషితం చేస్తున్నారు. ఎవరైనా ఫ్యాక్టరీలు రావాలని ఆశిస్తాం. ఒక ఫ్యాక్టరీ వస్తుందంటే ఉపాధి దొరుకుతుంది. కానీ దివీస్ ఏర్పాటు వల్ల దాదాపు 20 వేల మందికి ఉపాధి పోతుంది. సముద్రంలోకి కలుషిత నీరు వదులుతారు. దివీస్ సంస్థ గనక ఇక్కడ పెడితే వారు రోజుకి 65 లక్షల లీటర్ల నీరు వాడుకొని, 55 లక్షల లీటర్ల కలుషిత నీరు సముద్రంలోకి వదులుతారు...అంటే ఒక మున్సిపాలిటీ నగరం జనాలు రోజుకు తాగే నీరు అన్న మాట... . ఈ నీరు సముద్రంలో కలిస్తే మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో 20 వేల మంది మత్స్యకారులు బతుకులు దుర్భర పరిస్థితులు ఏర్పడుతాయి. ఇప్పటికే రూ.400 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ హేచరిస్ ఏర్పాటు చేశారు. ఫార్మసిటికల్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వారి పరిస్థితి ఏంటి. ఇక్కడే ఎందుకు పెడుతున్నారంటే.. ఎకరం రూ.5 లక్షలకు ధారదత్తం చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. పేదల భూములు లాక్కొని దివీస్‌కు 630 ఎకరాల భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 600 కోట్లు విలువ చేసే భూములు కేవలం రూ.30 కోట్లకు కట్టబెట్టి..మిగిలిన ఆదాయాన్ని దివీస్ యాజమాన్యం, చంద్రబాబు పంచుకోవాలని చూస్తున్నారు. రైతులు పోరాటం చేస్తుంటే వాళ్లపై పోలీసులతో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.