శ్మశానవాటికను అభివృద్ధి చేద్దాం

నెల్లూరు రూరల్‌: శ్మశానవాటిక పరిరక్షణ కోసం, మౌళిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి శ్మశానవాటికకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దారి ఏర్పాటు చేసుకోవాలని, దానికి సంబంధించిన ఖర్చు మొత్తం తానే భరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అనేక సంవత్సరాలుగా సతమతమవుతున్న సమస్యను నిమిషాల్లో పరిష్కరించిన ఎమ్మెల్యేకి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top